భారత రాజ్యాంగం - ప్రాధమిక హక్కులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భారత రాజ్యాంగం - ప్రాధమిక హక్కులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

02-11-12

సమానత్వపు హక్కు - Right to equality

 సమానత్వపు హక్కు  - Right to equality

సమానత్వపు హక్కు, రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 17 మరియు 18 ల ప్రకారం ప్రసాదించబడినది.
ఈ హక్కు చాలా ప్రధానమైనది, స్వేచ్ఛా సమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు, క్రింది విషయాల గ్యారంటీనిస్తుంది :
  • చట్టం ముందు సమానత్వం : రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్) 14 ప్రకారం, పౌరులందరూ సమానంగా, భారతచట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం  పౌరుల పట్ల ఏలాంటి వివక్షలు మరియు భేదాలు చూపరాదు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ మరియు పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి భేదాలు చూపరాదు.
  • పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం మరియు సమాన ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్‌లు, మరియు దేవాలయాలు మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగివున్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం, స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడినవారికి ప్రత్యేక సదుపాయాలు, ప్రభుత్వాలు కలుగజేయవచ్చు.
  • పౌర ఉద్యోగాల విషయాలలో సమానత్వం : అధికరణ 16 ప్రకారం, ఉద్యోగాలు పొందేందుకు, ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు, పౌరులకు ఏలాంటి వివక్షలూ చూపరాదు. 2003 'పౌర (సవరణ) బిల్లు' ప్రకారం, ఈ హక్కు, ఇతర దేశాల పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు.
  • అంటరానితనం నిషేధాలు : అధికరణ 17 ప్రకారం, అంటరానితనాన్ని ఎవరైనా అవలంబిస్తూవుంటే చట్టం ప్రకారం శిక్షార్హులు.అంటరానితనం నేర చట్టం (1955), 1976లో పౌరహక్కుల పరిరక్షణా చట్టం పేరుమార్పు పొందింది.
  • బిరుదుల నిషేధాలు : అధికరణ 18 ప్రకారం, భారత పౌరులు, ఏలాంటి బిరుదులూ పొందరాదు. ఇతరదేశాలనుండి కూడా ఏలాంటి బిరుదులు పొందరాదు. ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం, రాయ్ బహాదుర్, ఖాన్ బహాదుర్ లాంటి, "ప్రభుత్వ లేక రాజ్య సంబంధ బిరుదులు", సైన్యపరమైన బిరుదులూ ప్రకటించేది, ఇలాంటివి నిషేధం. కానీ విద్య, సంస్కృతీ, కళలు, శాస్త్రాలు మొదలగువాటి బిరుదులు ప్రసాదించనూవచ్చు మరియు పొందనూ వచ్చు. భారత రత్న మరియు పద్మ విభూషణ్ లాంటి వాటిని పొందినవారు, వీటిన తమ "గౌరవాలు"గా పరిగణించవచ్చుగాని, 'బిరుదులు'గా పరగణించరాదు 1995, 15 డిసెంబరు న సుప్రీంకోర్టు, ఇలాంటి బిరుదుల విలువలను నిలుపుదలచేసింది.

భారత రాజ్యాంగం - ప్రాధమిక హక్కులు


 భారతదేశంలో ప్రాథమిక హక్కులు  
Fundamental Rights in India

 భారత రాజ్యాంగం మూడవభాగం  ('Part III - Fundamental Rights' ) ప్రకారం, శాంతియుత సహజీవనం కొరకు భారతదేశపు పౌరులకు ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. ఈ హక్కులు ప్రజాస్వామ్యంలో పౌరులు తమ వైయుక్తిత హక్కులైన, సమానత్వపు హక్కు, వాక్‌స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, మతావలంబీకరణ హక్కు, మొదలగునవి రాజ్యాంగపరంగా పొందే హక్కులు. ఈ హక్కుల సంరక్షణార్థం న్యాయవ్యవస్థ తన అధికారాలను ఉపయోగించి, పౌరులు ఈ హక్కులు పొందేలా చర్యలు తీసుకుంటుంది. భారత ప్రజలు, కుల, మత, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేకుండా ఈ హక్కులను పొందగలరు.


ప్రాథమిక హక్కులు :
  1. సమానత్వపు హక్కు
  2. స్వాతంత్ర్యపు హక్కు
  3. దోపిడిని నివారించే హక్కు (Right against exploitation)
  4. మతస్వేచ్ఛ హక్కు
  5. సాంస్కృతిక మరియు విద్యాహక్కు
  6. రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to constitutional remedies)
మానవ హక్కులు సాహిత్యపరంగా వైయుక్తిక స్వేచ్ఛాస్వాతంత్రాలు, వీటి ద్వారా వ్యక్తిగత మరియు సామాజిక 'మంచి'ని అభివృద్ధిని పెంపొందించవచ్చును. భారత రాజ్యాంగం, భారత పౌరులకు ఈ హక్కులను అధికారికంగా గ్యారంటీ ఇస్తుంది. వీటిని అమలు పరచేందుకు మరియు పరిరక్షించేందుకు భారత న్యాయవ్యవస్థ యున్నది.
ఈ హక్కులు అనంతాలు కావు, వీటిని అవసరాల నిమిత్తం పార్లమెంటు లో సవరిస్తూ వుంటారు.