09-07-12

న్యాయనిర్వహణ వ్యవస్థ


న్యాయనిర్వహణ వ్యవస్థ


సుప్రీం కోర్ట్

సుప్రీం కోర్ట్ మన దేశ అత్యున్నత న్యాయస్థానం. న్యూ ఢిల్లీ లో వుంది.ఇందులో ప్రధాన న్యాయమూర్తితో పాటు 30 మంది న్యాయ మూర్తులు వుంటారు.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ
మూర్తి ని రాష్ట్రపతి నియమిస్తారు. ఇతరుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకుంటారు.
ప్రస్తుత సుప్రీం కోర్టు 38 వ ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.హెచ్.కపాడియా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి లేని సందర్భంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తే రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.

సుప్రీం కోర్టు తీర్పుకు దేశంలోని పౌరులు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లోబడి వుండాలి.దీని తీర్పుపై అప్పీలు చేసే అవకాశం లేదు.అయితే ఒక పౌరుడికి కోర్టు మరణ శిక్ష విధిస్తే అతడికి క్షమాభిక్ష పెట్టటానికి,లేదా శిక్షను తగ్గించి,యావజ్జీవ కారాగార శిక్షగా మార్చటానికి రాష్ట్ర పతికి మాత్రం అధికారం వుంటుంది.


రాష్ట్ర హైకోర్టులు



భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఉన్నత న్యాయ స్థానం ఉండాలని నిర్దేశిస్తుంది.కానీ ప్రత్యేక పరిస్థితుల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక హైకోర్టు ఉండేలా పార్లమెంట్ నిర్ణయించవచ్చు.ప్రస్తుతం మన దేశం లో మొత్తం 24 హైకోర్టులు వున్నాయి. ( ఇటీవల లోక్ సభ 12,మే 2012 న త్రిపుర,మేఘాలయ ,మణిపూర్ లకు స్వతంత్ర హైకోర్టులను ఆమోదించింది.వీటితో కలిపి మొత్తం 24 )

మన రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ లో ఉంది. ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం జస్టిస్ పినాకి చంద్రఘోష్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటూ 38 మంది న్యాయ మూర్తులు ఉన్నారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతి నియమిస్తారు.అయితే రాభారట ప్రధాన న్యాయమూర్తి,రాష్ట్ర గవర్నర్లను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు.

జిల్లా న్యాయస్థానాలు

1.జిల్లా సివిల్ కోర్టులు
2.జిల్లా సెషన్స్ కోర్టులు
3.సబ్ కోర్టులు
4.మున్సిఫ్ కోర్టులు
5.మేజిస్ట్రేట్ కోర్టులు

హైకోర్టులు,సివిల్.క్రిమినల్ కేసులను విచారిస్తాయి.కోర్టు విచారణలో నేరం రుజువైతే చట్టప్రకారం శిక్ష విధిస్తాయి.అయితే ఒక్కొక్క కోర్టుకి కొన్ని పరిమితులుంటాయి.జిల్లా సెషన్స్ కోర్టుకి మరణ శిక్ష విధించే అధికారం వుంది. కానీ కింది కోర్టులకు అలాంటి అధికారం లేదు.కింది కోర్టుల తీర్పులపై పై
కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

జిల్లాలోని అన్ని సివిల్,క్రిమినల్ కోర్టులు జిల్లా న్యాయమూర్తి ఆజమాయిషీలో ఉంటాయి. ఈయనే జిల్లా సెషన్సు కోర్టు న్యాయమూర్తిగా కూడా వ్యవహరిస్తారు.పని భారం ఎక్కువైతే అదనంగా మరో న్యాయమూర్తిని నియమిస్తారు.జిల్లా జడ్జిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి గవర్నర్ నియమిస్తారు ,ఈ విధంగా రాష్ట్రంలో న్యాయస్థానాలన్నీ ఒక శాఖగా పనిచ్చేస్తాయి.

ప్రజా న్యాయస్థానం ( లోక్ అదాలత్ )

కొన్నిసార్లు న్యాయ స్థానంలొ కేసుల పరిష్కారానికి సంవత్సరాల కొద్దీ ఎదురు చూడల్సి వస్తుంది. అలాగే వాది-ప్రతివాది పరిష్కారాలకు సుముఖంగా ఉండరు. కొన్ని కేసులను తేలికగా పరిష్కరించటానికి వీలుంటుంది.మరి కొన్ని కేసులు పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో ఒక కొలిక్కి తీసుకు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆయా కేసులను పరిష్కరించి,చట్టబద్ధమైన ప్రతిపత్తి కల్పించే వ్యవస్థే ప్రజా న్యాయ స్థానం ( లోక్ అదాలత్ )
మన రాష్ట్రం లో ప్రస్తుతం 70 వరకు లోక్ అదాలత్ లు ఉన్నాయి.సాధారణ న్యాయ స్థానాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తి లోక్ అదాలత్ న్యాయాధిపతిగా వ్యవహరిస్తారు.దీని ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయి.

మనదేశ న్యాయనిర్వహణ వ్యవస్థ



Hierarchy Of Indian Judicial System

మనదేశ
న్యాయనిర్వహణ వ్యవస్థ


సుప్రీం కోర్టు

హైకోర్టులు

జిల్లా సివిల్, సెషన్స్ కోర్టులు

సబార్డినేట్ సివిల్ కోర్టులు -------- మేజిస్ట్రేట్ కోర్టులు

మున్సిఫ్ కోర్టులు ---------- సబార్డినేట్ మేజిస్ట్రేట్ కోర్టులు


శాసనాలు -- న్యాయస్థానాలు


శాసనాలు

ప్రభుత్వ స్వరూపాన్ని,నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను నిర్ణయించే ఒక అద్భుత మూలాధార చట్టమే "రాజ్యాంగం".
రాజ్యంలోని పౌరులందరూ శాసనాల ప్రకారం నడచుకుంటే వారి మధ్య విభేదాలు వుండవు,కానీ అనేక రకాల స్వభావాలున్న వారి వలన వివాదాలు తలెత్తుతాయి.

వీటికి ప్రధాన కారణం ఆర్ధిక నేరాలకు పాల్పడటం.రుణ చెల్లింపులు,ఆస్తుల పంపకం,అమ్మకాల వంటివి. ఇలాంటి వివాదాలు ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా
వ్యక్తీకీ , ప్రభుత్వానికి , లేదా రెండు ప్రభుత్వాల మధ్యన తలెత్తవచ్చు.
ఐతే ప్రతి వివాదం లో రెండు,అంతకంటే ఎక్కువ పక్షాలు ఉండవచ్చు. వీరిలో ఒక పక్షం మరొక పక్షంపై న్యాయ స్థానంలో తమ సమస్యను గురించి ఫిర్యాదు చేయవచ్చు.

ఇలా ఫిర్యాదు చేసే పక్షాన్ని 'ఫిర్యాది' లేదా 'వాది' అని,రెండో పక్షాన్ని 'ప్రతివాది' అనీ అంటారు.

న్యాయస్థానాలు

సుప్రీంకోర్ట్ అఫ్ ఇండియా


రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాధమిక హక్కులకు ఆటంకం ఏర్పడితే న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తాయి.ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా 'రాజ్యాంగ పరిహార హక్కును' కూడా కల్పించారు.బాధితులు న్యాయం కోసం వివిధ న్యాయ స్థానాలలో ఫిర్యాదు చేస్తారు.దేని ఆధారంగా కోర్టు కేసులను నమోదు చేయిస్తుంది.

కేసులను 3 రకాలుగా విభజించవచ్చు.
1.సివిల్ కేసులు
2.క్రిమినల్ కేసులు
3.రాజ్యాంగ సంబంధమైన కేసులు


1.సివిల్ కేసులు :
స్థిర,చరాస్తులకు,వ్యవహారాల ఒప్పందాలకు,సామాజిక,కుటుంబ సంబంధ వివాదాలకు సంబంధించినవి. ఇలాంటి పౌర సంబంధమైన (సివిల్) కేసులను మున్సిఫ్ కోర్టులు,జిల్లా సివిల్ కోర్టులు మాత్రమే విచారించి,పరిష్కరిస్తాయి.

2.క్రిమినల్ కేసులు :
సంఘ విద్రోహ చర్యలకు,వ్యక్తుల మధ్య దౌర్జన్యాలకు సంబంధించినవి.శాంతి భద్రతలను సంబంధించిన తగాదాలు కాబట్టి ఇలాంటి కేసులను మేజిస్ట్రేట్ కోర్టులు,జిల్లా కోర్టులు విచారించి,సమస్యను పరిష్కరిస్తాయి. అయితే కొన్ని న్యాయస్థానాలు సివిల్,క్రిమినల్ కేసులు రెండిటినీ విచారిస్తాయి.

3.రాజ్యాంగ సంబంధమైన కేసులు :
రాజ్యాంగ సంబంధిత ఉన్నత కేసులను హైకోర్టు,సుప్రీం కోర్టులు విచారిస్తాయి. రాష్ట్రం లో వుండే న్యాయస్థానాల
నన్నింటి
లోనూ హైకోర్టు,దేశానికంతటికీ సుప్రీం కోర్టు ఉన్నతమైనవి.

పౌరుల ప్రాధమిక హక్కులకు న్యాయష్టానాలు రక్షణ కల్పిస్తాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలు లేదా వాటి ద్వారా రూపొందిన నిబంధనల
వలన పౌరహక్కులకు భంగం వాటిల్లిన సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి.

సంబంధిత శాసనాలపై వ్యాఖ్యానించి,అవసరమైతే దానికి కారణమైన ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని తీర్పిస్తాయి.
ఇలాంటి తీర్పునిచ్చే అధికారం సుప్రీం,హైకోర్టులకు ఉంటుంది.

హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్


న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి

అధికారవిభజన ద్వారానే ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేస్తుంది. అందుకే శాసన నిర్మాణ బాధ్యత శాసన సభలకు,వాటి అమలు బాధ్యత కార్య నిర్వాహణ శాఖకు, వివాదాలు తలెత్తినప్పుడు వాటిపై వ్యాఖ్యానించే బాధ్యత న్యాయ శాఖకు అప్పగించారు.

దేశంలోని మొత్తం న్యాయ స్థానాలను కలిపి న్యాయ శాఖ అంటారు. జాతీయ స్థాయిలో సుప్రీం కోర్టు,రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉన్నత న్యాయ స్థానాలు. న్యాయ శాఖ రాజ్యాంగానికి రక్షణ కల్పిస్తుంది.

కార్య నిర్వాహక శాఖ ఆజమాయిషీలో ఉంచకుండా స్వయం ప్రతిపత్తితో,నిష్పక్షపాతంగా ప్రజలకు న్యాయాన్ని అందించేలా న్యాయశాఖకు రాజ్యాంగంలో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు.

ఇందులో భాగంగానే సుప్రీం కోర్టు,
హైకోర్టు న్యాయ మూర్తులను రాజ్యాంగ రీత్యా రాష్ట్ర పతి నియమించినా,
వారిని పదవి నుంచి తొలగించే తొలగించటానికి ఆయనకు అధికారం వుండదు. అంటే వారిపై వచ్చిన అభియోగాలపై
శాసన నిర్మాణ సభలు చర్చించి,2/3 వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి.అప్పుడే వారిని పదవీచ్యుతులను చేయటం సాధ్యమవుతుంది.