భారతదేశంలో ప్రాథమిక హక్కులు
Fundamental Rights in India
భారత రాజ్యాంగం మూడవభాగం ('Part III - Fundamental Rights' ) ప్రకారం, శాంతియుత సహజీవనం కొరకు భారతదేశపు పౌరులకు ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. ఈ హక్కులు ప్రజాస్వామ్యంలో పౌరులు తమ వైయుక్తిత హక్కులైన, సమానత్వపు హక్కు, వాక్‌స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, మతావలంబీకరణ హక్కు, మొదలగునవి రాజ్యాంగపరంగా పొందే హక్కులు. ఈ హక్కుల సంరక్షణార్థం న్యాయవ్యవస్థ తన అధికారాలను ఉపయోగించి, పౌరులు ఈ హక్కులు పొందేలా చర్యలు తీసుకుంటుంది. భారత ప్రజలు, కుల, మత, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేకుండా ఈ హక్కులను పొందగలరు.
ప్రాథమిక హక్కులు :
- సమానత్వపు హక్కు
- స్వాతంత్ర్యపు హక్కు
- దోపిడిని నివారించే హక్కు (Right against exploitation)
- మతస్వేచ్ఛ హక్కు
- సాంస్కృతిక మరియు విద్యాహక్కు
- రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to constitutional remedies)
ఈ హక్కులు అనంతాలు కావు, వీటిని అవసరాల నిమిత్తం పార్లమెంటు లో సవరిస్తూ వుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి