ప్రజా ప్రయోజన వ్యాజ్యం
భారతీయ చట్టంలో, ప్రజా ప్రయోజనాన్ని రక్షించేందుకు ఉద్దేశించిన వ్యాజ్యాన్ని
ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదా ప్రజాహిత వ్యాజ్యం (public interest litigation (PIL)) అంటారు.
నష్టపడిన పక్షం ద్వారా కాకుండా, న్యాయస్థానమే స్వయంగా విచారణ చేపట్టడం లేదా ఏదైనా ఇతర స్వకీయ పక్షం ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానంలో దాఖలు చేయడం జరుగుతుంది.
సొంత హక్కు ఉల్లంఘించబడటంతో బాధించబడిన ఒక వ్యక్తి న్యాయస్థాన అధికార పరిధిలో విచారణ కోసం, వ్యక్తిగతంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. న్యాయవ్యవస్థ క్రియాశీలత ద్వారా న్యాయస్థానాలు ప్రజలకు ఇచ్చిన అధికారమే ప్రజా ప్రయోజన వ్యాజ్యం.
వ్యాజ్యంపై పోరాడేందుకు బాధితుడి వద్ద అవసరమైన వనరులు లేనప్పుడు లేదా అతను న్యాయస్థానానికి వెళ్లే స్వేచ్ఛను హరించినప్పుడు లేదా అన్యాయంగా అడ్డుకున్నప్పుడు ఇటువంటి వ్యాజ్యాలు దాఖలు చేయవచ్చు. అన్యాయం జరిగిన విషయం న్యాయస్థానం దృష్టికి వచ్చినట్లయితే, న్యాయస్థానమే స్వయంగా విచారణ చేపట్టడం లేదా ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేసే వ్యక్తి ద్వారా దాఖలు చేయబడిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించడం చేయవచ్చు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి (PIL) మూలాలు
1980వ దశకానికి ముందు, బాధిత పక్షం మాత్రమే న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే, 1980వ దశకం మరియు దేశంలో అత్యవసర పరిస్థితి తరువాత, సుప్రీంకోర్టు ప్రజలకు చేరువకావాలని నిర్ణయించింది,
ఇందుకోసం అత్యున్నత న్యాయస్థానం ఒక వినూత్న మార్గాన్ని పరిచయం చేసింది, దీనిలో భాగంగా ప్రజా ప్రయోజనం పణంగా పెట్టబడిన కేసుల్లో న్యాయపరమైన పరిష్కారాలను కోరుతూ ఒక వ్యక్తి లేదా ఒక పౌర సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (PIL) స్వీకరించిన మొట్టమొదటి న్యాయమూర్తుల్లో న్యాయమూర్తి పీఎన్ భగవతి మరియు న్యాయమూర్తి వీఆర్ కృష్ణ అయ్యర్ ఉన్నారు.
ఇతర న్యాయపరమైన వ్యాజ్యం మాదిరిగా, ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు, న్యాయస్థానానికి పంపిన లేఖలు మరియు టెలిగ్రామ్‌లను కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా స్వీకరించి, వాటిపై విచారణలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Procedure to File a Public Interest Litigation
A "Public Interest
Litigation", is filed in the same manner, as a writ petition is filed.
In High Court
If a Public Interest Litigation is
filed in a High court, then two (2) copies of the petition have to be filed.
Also, an advance copy of the petition has to be served on the each respondent,
i.e. opposite party, and this proof of service has to be affixed on the
petition.
In Supreme Court
If a Public Interest Litigation is
filed in the Supreme court, then (4)+(1) (i.e. 5) sets
of petition has to be filed opposite party is served, the copy only when notice
is issued.
Court Fees
A Court fee of
RS. 50, per respondent (i.e. for each number of opposite party, court
fees of RS. 50) has to be affixed on the petition.
Procedure
-
Proceedings, in the PUBLIC INTEREST LITIGATION commence and carry on in the same manner, as other cases.
-
However, in between the proceedings if the judge feels he may appoint a commissioner, to inspect allegations like pollution being caused, trees being cut, sewer problems, etc.
-
After filing of replies, by opposite party, and rejoinder by the petitioner, final hearing takes place, and the judge gives his final decision.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి